'ఆలయ భూమి మాదే' - పంటకోతకు వైఎస్సార్సీపీ శ్రేణుల యత్నం - YSRCP CADRE VIOLENCE

🎬 Watch Now: Feature Video

thumbnail
ఆలయ భూమి తమదే అంటూ పంటకోతకు వైఎస్సార్సీపీ శ్రేణుల యత్నం (ETV)

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 27, 2025 at 5:06 PM IST

1 Min Read
Choose ETV Bharat

YSRCP Leaders Encroach: పొలంలో కంది పంట కోతకు వైఎస్సార్సీపీ శ్రేణులు యత్నించగా గ్రామస్థులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. విడపనకల్లు మండలం జనార్దనపల్లిలో పాండురంగస్వామి ఆలయానికి చెందిన 21 ఎకరాల్లో ఖరీఫ్‌లో స్థానికులు కంది సాగు చేశారు. అది ఆలయ భూమి కాదని తాము కొనుగోలు చేశామంటూ ఉరవకొండ మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు లత్తవరం గోవిందు, ఆయన బంధువులు వాదిస్తున్నారు. దీనిపై రెండేళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సాగు చేసిన కంది పంట కోతకు వచ్చింది. శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ శ్రేణులు కోత యంత్రంతో వెళ్లి పంటను కోసేందుకు యత్నించారు. గమనించిన సర్పంచి జనార్దన్‌నాయుడు, గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు పొలం వద్దకు చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని మీరెలా వస్తారని వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులను ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మాపై ఉందని ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులతో చర్చించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో ఉప తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ ఘటనాస్థలానికి చేరుకుని రికార్డులను పరిశీలించారు. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని ఎవరూ ఘర్షణ పడవద్దని ఉప తహసీల్దార్‌ ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో శాంతించారు.

ABOUT THE AUTHOR

...view details