హారన్ కొట్టాడని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకుల దాడి - మహిళా కండక్టర్‌పైనా అటాక్ - YOUTHS ATTACK RTC BUS DRIVER
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 12, 2026 at 6:10 PM IST
Youths Attack RTC Bus Driver for Honking Horn in AP : హారన్ కొట్టాడని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కొందరు యువకులు దాడి చేశారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఈ ఘటన జరిగింది. యువకుల దాడిలో బస్సు డ్రైవర్ కాజా హుస్సేన్‌కు గాయాలయ్యాయి. అంతేగాక దాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధిస్తున్న మహిళా కండక్టర్ గీతాంజలిపైనా దాడి చేసి ఆమె సెల్‌ఫోన్ పగలగొట్టారు. గాయపడిన కండక్టర్, డ్రైవర్‌ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు అనంతపురం నుంచి ధర్మవరం వస్తున్న సమయంలో గుడ్లూరు గ్రామం వద్ద మృతదేహంతో కొంత మంది శ్మశానానికి వెళ్తుండగా డ్రైవర్ హారన్ కొట్టాడని, ఆ గుంపులో ఓ వ్యక్తి కిందపడిపోయాడని మహిళా కండక్టర్ గీతాంజలి పోలీసులకు వివరించారు. ఆ తర్వాత ద్విచక్ర వాహనాల్లో ఆర్టీసీ బస్సును వెంబడించిన యువకులు ధర్మవరం మార్కెట్ యార్డు వద్ద బస్సును అడ్డగించారని తెలిపారు. అనంతరం తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో దాడి చేసిన వారిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.