టర్నింగ్లో అదుపుతప్పిన బైక్ - గాల్లోకి ఎగిరిపడి యువకుడు మృతి
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 19, 2026 at 4:41 PM IST
Motorcycle Accident Krishna District : ఓ యువకుడు అతివేగంగా ద్విచక్రవాహనం నడిపి ప్రాణాలు కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలో జరిగింది. మోటార్ సైకిల్ అదుపుతప్పి కింద పడటంతో పామర్రుకు చెందిన దేవరకొండ రాజేష్ (21) మృతి చెందాడు. రాజేష్ ఉయ్యూరు నుంచి పామర్రుకు వెళ్తూ అతివేగంగా బైక్ నడిపాడు. మంటాడ సెంటర్ సమీపంలో వాహనం అదుపు తప్పడంతో బైక్‌తో సహా రాజేష్ ఎగిరి కిందపడిపోయాడు. ఈ క్రమంలో తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పమిడిముక్కల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ ధరించాలని నిపుణలు అంటున్నారు. ఓవర్‌టేకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో మద్యం, డ్రగ్స్ తీసుకుని బైక్ నడపకూడదని సూచిస్తున్నారు. మొబైల్ మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేయకూడదంటున్నారు. వేగంగా బైక్ నడపడం సరదాగా ఉండొచ్చు. కానీ జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉందటున్నారు. సురక్షితంగా నడిపి, ఇంటికి సురక్షితంగా చేరుకోవాలని సూచిస్తున్నారు.