యువకుడి ప్రాణం తీసిన అతివేగం - వైరల్‌గా మారిన సీసీటీవీ దృశ్యాలు - BAPATLA ROAD ACCIDENT
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 21, 2026 at 4:27 PM IST
Bapatla Road Accident : అతి వేగం ఒక యువకుడి ఆయువు తీసిన సంఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో చోటుచేసుకుంది. ఈపూరుపాలెం ఎస్సై రామాంజనేయులు తెలిపిన వివరాల మేరకు, చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన చల్లా సురేంద్ర (30) వాడరేవు బీచ్‌కు వచ్చి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో సురేంద్ర స్పీడ్ బ్రేకర్‌పై నుంచి వేగంగా వెళ్లడంతో వాహనం అదుపుతప్పి బండిపై నుంచి ఎగిరి కిందపడడంతో తలకు తీవ్రగాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రమాదం జరిగేది కాదని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు సీసీ కెమెరాలో రికార్డైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల సూచనలు : కొద్ది దూరమైనా సరే, కేవలం పక్క వీధికే కదా వెళ్లేది అని హెల్మెట్ లేకుండా బైక్ తీయకూడదు. ప్రమాదాలు ఎప్పుడైనా, ఎక్కడైనా జరగొచ్చు. వాహనాన్ని ఎప్పుడూ నియంత్రించగల వేగంతోనే నడపాలి. హెల్మెట్ ధరించడం పోలీస్ చలానాల నుంచి తప్పించుకోవడానికి కాదు, మీ ప్రాణాలను కాపాడుకోవడానికి అనే విషయాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలి. మీ కుటుంబం మీ కోసం ఇంట్లో ఎదురుచూస్తుందని గ్రహించి బాధ్యతగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.