Live: గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం - ప్రత్యక్ష ప్రసారం - WORLD TELUGU MAHASABHALU LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 12:08 PM IST
World Telugu Mahasabhalu at Guntur District: గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. శ్రీనివాస కల్యాణంతో ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారు. గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో మహాసభలు జరుగుతున్నాయి. ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి. 3వ ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాన వేదిక ముందు ఏర్పాటు చేసిన రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో తెలుగుభాష ప్రాచీనత్వాన్ని ప్రస్ఫుటించేలా పురాతన సాహిత్యం, ప్రాచీన నాణేలు, తెలుగు సంప్రదాయ వంటకాలు సందడి చేయనున్నాయి. సాయంత్రం ఏర్పాటు చేసిన ఆంధ్ర శ్రీపూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరుకానున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.హెచ్.మానవేంద్రనాథ్‌రాయ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, విశ్వహిందీ పరిషత్తు సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొననున్నారు.