గిరిజనగూడేల్లో తాగునీటి కష్టాలు - నీటి వెతలు తీర్చాలంటూ మొర - WATER SCARCITY PROBLEMS
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 18, 2026 at 12:40 PM IST
Water Scarcity Problems In Alluri District : ప్రభుత్వాలు మారుతున్నా నేటికీ గిరిజనగూడేల్లో తాగునీటి కష్టాలు తీరడం లేదు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపిలి పంచాయతీ మొరలోవలో గిరిజనులు గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. "మా గ్రామానికి నీళ్లు ఇవ్వండి" అంటూ ఆ గిరిజనులు వినూత్నంగా చేతులు జోడించి మొర పెట్టుకుంటున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే తమ గోడు వినేవారు లేరా అంటూ ఆవేదన చెందుతున్నారు. నీరు ఇవ్వాలని మొక్కుకుంటూ అనంతగిరి మండలం రొంపిలి పంచాయతీ మొరలోవ గిరిజనులు మొర పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో 12 కుటుంబాల్లో సుమారు 60 మంది నివసిస్తున్నారు. జల్ మిషన్ పథకం తమకు అందుబాటులో లేదని చెప్పారు. వేసవి వచ్చిందంటే కొండ దిగువన ఉన్న రెండు కిలోమీటర్ల దూరంలో నీటి ఊటలను పట్టుకుంటూ పిల్లాపాపలతో కష్టాల పడవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. పలుమార్లు బిందెలతో రాళ్లు తన్నుకుని పోయి గాయాలు పాలవుతున్నామన్నారు. పశువులు కూడా ఇదే నీటిని తాగుతున్నట్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్నామని గుక్కెడు నీటి ఊటల కోసం వెతుకుతున్నామని ఆవేదన చెందారు. వెంటనే కలెక్టర్ తమకు మంచినీటి సౌకర్యం కల్పించాలని చేతులు ఎత్తి జోడిస్తున్నారు.