Video Viral - మత్తు తలకెక్కి ఈ వాచ్మెన్ చేసిన పని చూడండి - WATCHMAN DRUNK AND SLEEP IN RICE
🎬 Watch Now: Feature Video

Published : November 14, 2025 at 9:55 AM IST
Watchman Getting Drunk in Hostel Video Viral : వాచ్మెన్ తప్పతాగి విద్యార్థులకు వండిన అన్నంలో కాలు పెట్టి పడుతున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగింది. బుధవారం జరిగిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు బుధవారం రాత్రి భోజనం చేయడానికి వసతిగృహంలోని భోజనశాలకు వెళ్లారు. అక్కడ తాత్కాలిక కాపలాదారు చంద్రశేఖర్ మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలు పెట్టి నిద్రిస్తుండడాన్ని అక్కడి వారు గుర్తించారు. సరిగ్గా తినే సమయానికే ఇలా వాచ్మెన్ చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. దీంతో వారు అక్కడి నుంచి ఖాళీ కడుపులతోనే హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని వంట చేయించే కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్లీ వంట చేసి విద్యార్థులకు వడ్డించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వాచ్‌మెన్‌ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.