అరకుకు పర్యాటకుల తాకిడి - రద్దీగా విశాఖ రైల్వేస్టేషన్ - RUSH AT VISAKHA RAILWAY STATION
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 5:17 PM IST
Passengers Rush At Visakha Railway Station : విశాఖ రైల్వే స్టేషన్‌లో అరకు ప్లాట్‌ఫారం జనాలతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవులు ఉండటంతో అరకు వెళ్లే యాత్రికుల సంఖ్య భారీగా పెరిగింది. ఉదయం 6 గంటల 45 నిమిషాలకు రావాల్సిన రైలు గంటకు పైగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్లాట్‌ఫారంపై వేలాది మంది ప్రయాణికులు వేచి ఉండగా రద్దీ కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. రైలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. రైలు సాధారణ బోగీల్లో ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆఫీసులు, విద్యాసంస్థలకు సెలవులు కావడంతో అందరూ విహారయాత్రలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలోనే అరకు వెళ్లే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎంతో మంది ప్రయాణికులు అరకుకు రైలు టికెట్ బుక్ చేసుకున్నారు. ఆ నేపథ్యంలోనే విశాఖ రైల్వేస్టేషన్ పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. ఆ రద్దీలో ట్రైన్ ఎక్కడానికి కూడా ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.