Live: ఏలూరులో హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి, సీఎం - ప్రత్యక్షప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
Vice President Radhakrishnan and CM Chandrababu Visit to Eluru District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 24, 2026 at 11:02 AM IST

|

Updated : August 24, 2026 at 1:14 PM IST

1 Min Read
Choose ETV Bharat

New Popcorn Seed in Eluru District : నేడు ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. దేశంలో తొలి నాన్-GMO పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఏలూరు జిల్లా జిల్లా ముసునూరులో గోర్మే పాప్‌ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యు పరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని ఇరువురు నేతలు ఆవిష్కరించారు. గోర్మే పాప్‌కార్నికా ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల ఎకరాల్లో పాప్‌కార్న్ మెయిజ్ సాగుతో వేలాది మంది రైతులతో భాగస్వామ్యం కలిగి ఉంది. ముసునూరులోని ప్లాంట్ ఆసియాలోనే అతిపెద్ద పాప్‌కార్న్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో ఒకటిగా నిర్మించారు. దేశంలోని వేలాది సినిమా థియేటర్లకు పాప్‌కార్న్ సరఫరా చేయడంలో సంస్థ కీలకంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి ముసునూరు మండలం, కాట్రేనిపాడుకు చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్​తో కలిసి ఆయన, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్​కు స్వాగతం పలికారు. హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : August 24, 2026 at 1:14 PM IST