హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై వచ్చి - ఇంటి ముందే చైన్ స్నాచింగ్ - CHAIN SNATCHING IN KURNOOL
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 11, 2026 at 1:54 PM IST
Chain Snatching In Kurnool Recorded In CC Cameras : కర్నూలులో ఇద్దరు దొంగలు హల్‌చల్ చేశారు. హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనంపై వచ్చి ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లారు. ఓ కుటుంబం వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించింది కానీ దొరకలేదు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో గుత్తి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సునీత అనే మహిళ ఇంటి ముందు ఫోన్ మాట్లాడుతూ ఉంది. అక్కడికి వచ్చిన దుండగులు ఆమె మెడలోని చైన్ లాక్కెళ్లారు. ఆ తర్వాత సంతోష్ నగర్‌లోని నాగమణి అనే మహిళ ఇంటి ముందు కూర్చుని ఉండగా ఆమె గొలుసు కూడా దొంగింలించారు. వెంటనే నాగమణి కుటుంబసభ్యులు యువకులను వెంబడించారు. ఓ వ్యక్తి బైక్‌ని బలంగా ఢీకొట్టడంతో దొంగలు కింద పడ్డారు. బైక్‌ను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.