భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం - ల్యాండ్​ అయిన తొలి విమానం - FLIGHT LANDED IN BHOGAPURAM AIRPORT

🎬 Watch Now: Feature Video

thumbnail
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం - ల్యాండ్​ అయిన తొలి విమానం (ETV)

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 4, 2026 at 1:44 PM IST

2 Min Read
Choose ETV Bharat

First Flight Landed in Bhogapuram International Airport at Vizianagaram District: రాష్ట్రంలో విమానయానం నేడు కొత్త రెక్కలు విప్పింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి టెస్ట్​ ఫ్లైట్​​ ల్యాండ్‌ అయింది. ఎయిరిండియా వ్యాలిడేషన్‌ (టెస్ట్‌) ఫ్లైట్‌ దిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ విమానంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్‌ తదితరులు ఉన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. 96 శాతం ప్రాజెక్టు నిర్మాణం అయినట్లు జీఎంఆర్‌ సంస్థ వెల్లడించింది. భోగాపురం విమానాశ్రయాన్ని జూన్‌ 26న ప్రారంభించనున్నారు. 6 నెలల ముందే భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. 280 కి.మీ వేగంతో వీచే తుపాను గాలులను తట్టుకునేలా విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. హుద్‌హుద్‌ తుపాను సమయంలో 250 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఇటువంటి తుపానులను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయ నిర్మిస్తున్నామని జీఎంఆర్​ సంస్థ తెలిపింది. గతంలో ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కానీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉండేదని రామ్మోహన్ అన్నారు. విమర్శలకు సమాధానంగా భోగాపురం విమానాశ్రయ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు చెప్పారు.

"ఏపీ అభివృద్ధిలో నేడు ఒక చారిత్రాత్మక మైలురాయి. విశాఖపట్నం తూర్పు తీర ఆర్థిక రాజధానిగా మారనుంది. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధికి ఒక శక్తివంతమైన ఇంజిన్​గా పని చేస్తుంది. ఇది ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. ప్రజలకు, వ్యాపారాలకు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ విమానాశ్రయం వాణిజ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఎగుమతులను పెంచుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పర్యాటక సామర్ధ్యాన్ని వెలికి తీస్తుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతాన్ని ప్రపంచ విమానయాన, వాణిజ్య పటంలో సుస్థిరంగా నిలుపుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూర్చేలా ఆధునిక, సమగ్ర వృద్ధి ఆధారిత విమానయాన మౌలిక సదుపాయాలను నిర్మించాలనే భారత ప్రభుత్వ దార్శనికతకు ఇది నిదర్శనం. అందుకు అనుగుణంగా ఉన్న ఈ జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసినందుకు, అంకితభావంతో పని చేసినందుకు భాగస్వాములందరినీ అభినందిస్తున్నా" అని రామ్మోహన్​ నాయుడు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details