విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్‌కు మంటలు - డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన పెనుప్రమాదం - JANGAREDDIGUDEM TRACTOR FIRE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 14, 2026 at 6:50 PM IST
Jangareddigudem Tractor Fire : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ముప్పు తప్పింది. పేరంపేటకు చెందిన దల్లిబోయిన వెంకటేశ్వరరావు తన ట్రాక్టర్‌పై గడ్డిని కొయ్యలగూడెం మండలం సీతంపేట గ్రామానికి తరలిస్తున్నాడు. మార్గమధ్యలో పేరంపేట రోడ్డులో వస్తుండగా గడ్డికి ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గడ్డి కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అయితే వెంటనే డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు. జనావాసాల్లో జరిగే నష్టాన్ని ముందే పసిగట్టాడు. వెంటనే ట్రాక్టర్‌ను ఏలూరు రోడ్డులోని శ్మశాన వాటికకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లాడు. అక్కడ హైడ్రాలిక్ సాయంతో మండుతున్న గడ్డిని ట్రక్కులోంచి కింద పడేశాడు. ఆ తర్వాత స్థానికుల సమాచారంతో ఫైర్ ఆఫీసర్ బాబురావు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డ్రైవర్ సమయానికి తీసుకున్న నిర్ణయం వల్లే పెను ప్రమాదం తప్పిందని స్థానికులు, అధికారులంటున్నారు.