LIVE: హనుమంత వాహనంపై మాఢవీధుల్లో మలయప్పస్వామి- ప్రత్యక్ష ప్రసారం

🎬 Watch Now: Feature Video

thumbnail
హనుమంత వాహనంపై మాఢవీధుల్లో మలయప్పస్వామి (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 17, 2026 at 8:12 AM IST

|

Updated : October 17, 2026 at 10:38 AM IST

1 Min Read
Choose ETV Bharat

Tirumala Navaratri Brahmotsavam LIVE: బ్రహ్మాండ నాయకుని కమనీయ ఉత్సవం కోనేటి రాయుడి వైభవానికి తార్కాణం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు హనుమంత వాహనంపై మాఢవీధుల్లో ఊరేగుతూ మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. నిన్న గరుడవాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. కనివినీ ఎరుగని రీతిలో కన్నుల పండువగా వైకుంఠనాథునికి సాగిన గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తజనం పోటెత్తింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా టీటీడీ సకల సౌకర్యాలు కల్పించింది. విశేష అభరణాలతో స్వామివారు మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని కొలిచారు. గరుడవాహన సేవను తిలకించేందుకు భక్తజనం భారీగా తరలివచ్చారు. 

శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం హనుమంత వాహనంపై స్వామివారు మాఢవీధుల్లో ఊరేగింపు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : October 17, 2026 at 10:38 AM IST