పెళ్లి మండపంలో రక్తదానం - నిండు హృదయాన్ని చాటుకున్న వధూవరులు - BLOOD DONATION IN WEDDING KURNOOL
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 8:41 AM IST
Bride And Groom Donates Blood During Marriage in Kurnool District: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జరిగిన ఓ వివాహ వేడుకలో 27 మంది రక్తదానం చేశారు. పట్టణానికి చెందిన విరూపాక్షీ స్వామి, వీణల వివాహం గురువారం దనిష్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుక కేవలం విందు వినోదాలకే పరిమితం కాకుండా సామాజిక స్పృహకు వేదికైంది. జనసేవ సామాజిక సేవా సంస్థ ద్వారా గత పదేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్న విరూపాక్షీ స్వామి, తన పెళ్లి రోజున 30వ సారి రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వరుడి స్ఫూర్తితో పెళ్లికి వచ్చిన స్నేహితులు, ఆత్మీయులు కలిపి మరో 27 మంది రక్తదానం చేయడం విశేషం. గతంలో తన సేవలకు గానూ జన విజ్ఞాన వేదిక వంటి సంస్థల నుంచి ఎన్నో అవార్డులు అందుకున్న విరూపాక్షీ స్వామి తన జీవితంలోని అతి ముఖ్యమైన రోజును సైతం నలుగురికి ప్రాణదానం చేసేలా మలచుకోవడం చూసి అతిథులందరూ వధూవరులను మనసారా అభినందించారు.