తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం - భక్తులకు శ్రీవారు అభయప్రదానం - TIRUMALA SWARNA RATHOTSAVAM
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 12:27 PM IST
Golden Chariot Festival Celebrated Grandly In Tirumala: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో కొండపై రద్దీ నెలకొంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తర ద్వార తలుపులను తెరిచి పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. అంతేకాకుండా పుణ్యాహవచనంతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజాకైంకర్యాలను అర్చకులు చేశారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శ్రీవారి వైకుంఠ ద్వారాలు అర్ధరాత్రి నుంచే తెరుచుకున్నాయి. మొదట వీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కృష్ణతేజ ప్రవేశ ప్రాంతం నుంచి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి భక్తులకు అనుమతిచ్చారు. లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే టీటీడీ అనుమతి ఇచ్చింది. ఏకాదశి పర్వదినాన 58 వేల మందికి ఈ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించగా శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారి భక్తులు దేశ, విదేశాల తరలి రావడం గమనార్హం.