LIVE : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు - ప్రత్యక్ష ప్రసారం - TELANGANA PANCHAYAT ELECTIONS LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Telangana Panchayat Elections Second Phase Live (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : December 14, 2025 at 7:05 AM IST

|

Updated : December 14, 2025 at 1:46 PM IST

1 Min Read
Choose ETV Bharat

Telangana Panchayat Elections Second Phase Live : రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్​ మొదలైంది. రెండో విడతలో 31 జిల్లాల్లోని 193 మండలాల పరిధిలో 4,333 గ్రామ పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలకు ఎస్​ఈసీ నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు రెండో విడత ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన వాటిని మినహాయించి 3,911 గ్రామ పంచాయతీలు, 29,917 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ఈ రెండో విడత ఎన్నికల బరిలో 12,834 మంది సర్పంచ్​ అభ్యర్థులు, 71,071 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. తొలిదశలో జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల కౌంటింగ్​ ప్రారంభం కానుంది.

Last Updated : December 14, 2025 at 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details