LIVE : తెలంగాణ పంచాయతీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ - ప్రత్యక్ష ప్రసారం - TELANGANA PANCHAYAT ELECTIONS LIVE
🎬 Watch Now: Feature Video

Published : December 11, 2025 at 9:14 AM IST
|Updated : December 11, 2025 at 1:38 PM IST
Telangana Panchayat Elections 2025 Live : రాష్ట్రంలో మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. 31 జిల్లాల్లోని 189 మండలాల పరిధిలో 4 వేల 236 గ్రామపంచాయతీలు, 37 వేల 440 వార్డుల్లో ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐదు పంచాయతీలు, 169 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా వాటిలో 396 మంది సర్పంచ్‌లు, 9 వేల 633 వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక గ్రామ పంచాయతీ, 10 వార్డుల్లో కోర్టు స్టే వల్ల ఎన్నికలు నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 834 గ్రామ పంచాయతీలు, 27 వేల 628 వార్డుల్లో నేడు ఎన్నికలు జరగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 834 మంది సర్పంచ్ అభ్యర్థులు, 65వేల 455 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. పంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్ జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.