LIVE : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు - ప్రత్యక్షప్రసారం - TELANGANA MUNICIPAL ELECTIONS 2026

🎬 Watch Now: Feature Video

thumbnail
Telangana Municipal Elections 2026 LIVE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : February 11, 2026 at 7:05 AM IST

|

Updated : February 11, 2026 at 6:31 PM IST

1 Min Read
Choose ETV Bharat

Telangana Municipal Elections 2026 LIVE : పురపోరులో కీలక ఘట్టం కాసేపట్లో మొదలు కానుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లలోని 2,981 వార్డుల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కోసం 8,203 కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 12,944 మంది అభ్యర్థులు సుమారు 52 లక్షల ఓటర్ల తీర్పు కోరుతున్నారు. ఓటర్లందరూ ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కోరారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు తెలిపిన రాణికుముదిని అవసరమైతే ఎస్‌ఈసీ వెబ్‌సైట్, టీఈ పోల్ మొబైల్ యాప్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని సూచించారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పోలింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల నిర్వహణలో 742 మంది జోనల్ అధికారులు, 279 ఫ్లయింగ్ స్క్వాడ్, 381 స్క్వాడ్ బృందాలు, 1,370 రిటర్నింగ్ అధికారులు, 1,547 ఏఆర్‌వోలు, 9,560 పోలింగ్ అధికారులు, 31,428 మంది సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియ వెబ్‌ కాస్టింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని ఎస్‌ఈసీ తెలిపింది.

Last Updated : February 11, 2026 at 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details