LIVE : తెలంగాణ శాసనసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - TELANGANA LEGISLATIVE ASSEMBLY

🎬 Watch Now: Feature Video

thumbnail
Telangana Legislative Assembly (Eenadu)

By ETV Bharat Telangana Team

Published : January 6, 2026 at 10:05 AM IST

|

Updated : January 6, 2026 at 10:20 PM IST

1 Min Read
Choose ETV Bharat

Telangana Legislative Assembly Live : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. శీతాకాల సమావేశాల్లో ఇవాళ  ‘హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (హిల్ట్‌)’ పాలసీపై సభలో చర్చ జరగనుంది. హైదరాబాద్‌ నగరంలో 50-60 ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా, కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ఈ పారిశ్రామికవాడల్లో నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘హిల్ట్‌’ పాలసీని తీసుకొచ్చింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ నేపథ్యంలో ‘హిల్ట్‌’ పాలసీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల తెలంగాణకు చేకూరే ప్రయోజనాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తుంది. నిన్న అసెంబ్లీలో ఆమోదం పొందిన జీఎస్టీ సవరణ బిల్లులు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను మండలిలో ప్రభుత్వం నేడు ప్రవేశ పెట్టనుంది. ఇవాళ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. ఇవాళ జరిగే శాసన సభ సమావేశాలను ఈటీవీ భారత్​ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం.

Last Updated : January 6, 2026 at 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details