LIVE : తెలంగాణ శాసనసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - TELANGANA ASSEMBLY LIVE
🎬 Watch Now: Feature Video

Published : January 5, 2026 at 10:02 AM IST
|Updated : January 5, 2026 at 6:08 PM IST
Telangana Assembly Winter Session Live : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. శీతాకాల సమావేశాల్లో నేడు ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్)’ పాలసీపై సభలో చర్చిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 50-60 ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా, కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపలికి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదే సమయంలో ఈ పారిశ్రామికవాడల్లో నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘హిల్ట్’ పాలసీని తీసుకొచ్చింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ నేపథ్యంలో ‘హిల్ట్’ పాలసీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల తెలంగాణకు చేకూరే ప్రయోజనాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తుంది. ఇవాళ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. ఇవాళ జరిగే శాసన సభ సమావేశాలను ఈటీవీ భారత్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం.