శ్రీశైల మల్లన్న సేవలో గవర్నర్ శివ్‌ ప్రతాప్‌ శుక్లా దంపతులు - TELANGANA GOVERNOR VISITS SRISAILAM

🎬 Watch Now: Feature Video

thumbnail
శ్రీశైల మల్లన్న సేవలో గవర్నర్ శివ్‌ ప్రతాప్‌ శుక్లా దంపతులు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : March 14, 2026 at 3:14 PM IST

1 Min Read
Choose ETV Bharat

Telangana Governor Shiv Pratap Shukla Visits Srisailam Temple : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని రాష్ట్ర నూతన గవర్నర్‌ శివ్ ​ప్రతాప్​ శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలను నిర్వహించారు. గవర్నర్ దంపతులకు శ్రీశైల దేవస్థానం అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో శ్రీశైల క్షేత్ర విశేషాల గ్రంథాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ఈవో, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

శివ్​ప్రతాప్​ శుక్లా ఇటీవలే తెలంగాణ గవర్నర్​గా నియమితులైన విషయం తెలిసిందే. ఆయన ఇటీవల యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని కూడా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈవో శ్రీనివాసరావు శివ్​ ప్రతాప్​ శుక్లా కుటుంబ సభ్యులకు స్వామివారి జ్ఞాపికను బహూకరించారు.

ABOUT THE AUTHOR

...view details