LIVE: హైదరాబాద్​ మైత్రీవనంలో ఎన్టీఆర్​ విగ్రహ ఆవిష్కరణ - హాజరైన సీఎం రేవంత్​రెడ్డి - CM REVANTH INAUGURATING NTR STATUE

🎬 Watch Now: Feature Video

thumbnail
Telangana CM Revanth Reddy (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 28, 2026 at 7:33 PM IST

|

Updated : May 28, 2026 at 8:25 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Revanth Reddy participates in NTR statue inauguration : హైదరాబాద్​లోని మైత్రీవనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ​ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్​ ఉపఎన్నికల్లో భాగంగా అప్పట్లో ​రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఇవాళ ఎన్టీఆర్​ 103​ జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, ఎన్టీఆర్​ అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా సోషల్​ మీడియా వేదికగా సీఎం రేవంత్​రెడ్డి నివాళి అర్పించారు. తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనించే తారకమంత్రం ఎన్టీఆర్​ అంటూ సీఎం కొనియాడారు. హైదరాబాద్​లో ఉదయం ఎన్టీఆర్ ఘాట్​ వద్ద ప్రముఖ నటుడు జూనియర్​ ఎన్టీఆర్​తో పాటు ఎన్టీఆర్ కుమార్తె ఎంపీ పురందేశ్వరి సహా కుటుంబసభ్యులు నివాళి అర్పించారు. సీనియర్​ నటుడు రాజేంద్ర ప్రసాద్​ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్​కు ఘనంగా నివాళి అర్పించారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్​ చరగని ముద్రవేశారని గుర్తుచేసుకున్నారు. మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను ప్రత్యక్షంగా చూద్దాం.. 

Last Updated : May 28, 2026 at 8:25 PM IST

ABOUT THE AUTHOR

ETV Bharat Telangana holds a significant position in both Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Building a strong presence in a specific region requires understanding the preferences and interests of the local population, ETV Bharat has successfully managed to do that in the state. Localised, original content that resonates with the culture, language, and aspirations of the people in the region plays a significant role in achieving this....view details