'ప్రత్యేక టెట్‌ నుంచి మినహాయించాలి' - విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన

🎬 Watch Now: Feature Video

thumbnail
విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 2, 2026 at 4:44 PM IST

1 Min Read
Choose ETV Bharat

Teachers Protest in Mangalagiri Vidya Bhavan : ప్రత్యేక టెట్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళగిరిలోని విద్యాభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలి వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. టీచర్ల ఆందోళనకు అనుమతి లేదని తెలిపారు. విద్యాభవన్‌లోకి వెళ్లేందుకు వారు యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

తమను ఈ వయస్సులో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) రాయమనడం దారుణమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది టీచర్లు డీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన వారు కూడా ఇందులో అర్హత సాధిస్తేనే ఉద్యోగాలు ఉంటాయని ప్రభుత్వాలు చెబుతున్నాయన్నారు. అయితే ఇన్​ సర్వీస్​ టీచర్లకు టెట్ మినహాయించాలని తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. తమిళనాడు తరహాలో తమకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నుంచి మినహాయింపు వచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ టెట్​ నోటిఫికేషన్​లో పాస్ మార్కులు 40 శాతానికి తగ్గించాలని, ఆఫ్‌లైన్‌లో పరీక్ష పెట్టాలని, గణితం, సైన్స్ బోధించే వారికి వారి సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. 