ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేశ్ - వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగం - VEERANJANEYULU JOB IN GGH
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 12, 2026 at 2:21 PM IST
Thota Veeranjaneyulu Got Government Job : 'జై బాబు' అంటూ ప్రాణాలు విడిచిన తోట చంద్రయ్య కుటుంబానికి ఇచ్చిన మాటను నిజం చేసి చూపించారు మంత్రి నారా లోకేశ్. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 'జై జగన్' అనలేదన్న ఒకే ఒక్క కారణంతో గుంటూరు జిల్లాకు చెందిన తోట చంద్రయ్యను వైఎస్సార్సీపీ శ్రేణులు గొంతుకోసి దారుణంగా హత్య చేశాయి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలోనూ చంద్రయ్య 'జై చంద్రబాబు' అంటూనే కన్నుమూశారు. ఆ సమయంలో ఆ కుటుంబానికి అండగా ఉంటామని, చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. వీరాంజనేయులకు ఉద్యోగం రాకుండా గతంలో వైఎస్సార్సీపీ మండలి వేదికగా అడ్డుపడింది. ఎన్నో సాంకేతిక ఇబ్బందులు సృష్టించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని అడ్డంకులను తొలగించారు. చివరకు జీజీహెచ్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా తోట వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేశ్‌కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వీరాంజనేయులు ధన్యవాదాలు తెలిపారు.