సాధారణ పీఏ ఇన్ని కోట్లు, బంగారం ఎలా సంపాదించారు?: టీడీపీ నేత పట్టాభి - TDP LEADER PATTABHIRAM ON JAGAN PA
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 29, 2026 at 8:33 PM IST
TDP Leader Pattabhiram On Jagan PA KNR Illegal Assets Issue: జగన్ పీఎ కేఎన్‌ఆర్ భార్య ఖాతాలోకి రూ. 20 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రశ్నించారు. కేఎన్‌ఆర్‌కు సంబంధించి బ్యాంకు ఖాతాల లావాదేవీలు చూస్తే ఎవరైనా అవాక్కు అవాల్సిందేనన్నారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడి ప్రతి అవినీతిలో కేఎన్‌ఆర్ భాగస్వామిగా ఉన్నారని పట్టాభి ఆరోపించారు.
సాధారణ పీఏ బ్యాంకు ఖాతాలో రూ.20 కోట్లెలా: సాధారణ పీఏగా ఉన్న వ్యక్తి ఇన్ని కోట్లు, బంగారం ఎలా సంపాదించారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు. జర్నలిస్టుగా ఉంటూ చిన్న వ్యాపారాలు చేసి సంపాదించారని బుకాయిస్తున్నారన్నారు. సొంత ఇల్లు కూడా లేని సీనియర్ జర్నలిస్టులు వందలమంది ఉన్నారని గుర్తు చేశారు. కోట్ల ఆస్తులు ఎలా సంపాదించవచ్చో కేఎన్‌ఆర్ ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవచ్చునని ఎద్దేవా చేశారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడి ప్రతి అవినీతిలో కేఎన్‌ఆర్ భాగస్వామిగా ఉన్నారని వివరించారు. గొడ్డలి పార్టీ చేసిన ప్రతి పాపంలో కేఎన్‌ఆర్ పాత్ర స్పష్టంగా ఉందన్నారు. తాడేపల్లి కేంద్రంగా జరిగిన ప్రతి పాపంలో కేఎన్‌ఆర్ పాత్ర సుస్పష్టంగా ఉందన్నారు. ఎవరి ఖాతాల్లోకి ఎన్ని కోట్లు వెళ్లాయో ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయన్న పట్టాభి, కేఎన్‌ఆర్‌కు సంబంధించి బ్యాంకు ఖాతాల లావాదేవీలు చూస్తే అవాక్కైపోవాల్సిందేనన్నారు. పీ4 పథకం ద్వారా పేదలను ఆదుకునేలా చంద్రబాబు ఆలోచనలు చేశారన్నారు.
ఆస్తులు రాష్ట్రాలకు విస్తరించాయన్న పట్టాభి: గొడ్డలి పార్టీకి కూడా ఒక పీ4 ఉందని పవర్, ప్రాపర్టీ, పైసా, పార్టనర్‌షిప్ అని విమర్శించారు. అడ్డగోలుగా ఆస్తులు సంపాదించడం, ఖజానాలో సొమ్ములు నింపుకోవడమే గొడ్డలి పార్టీ పీ4 అంటూ పట్టాభి చురకలంటించారు. పవర్, ప్రాపర్టీ, పైసా, పార్టనర్‌షిప్ ద్వారా వైఎస్సార్సీపీలో అనేకమంది లబ్ధి పొందారన్నారు. కేఎన్‌ఆర్ భార్యకు సంబంధించి బ్యాంకు ఖాతా పరిశీలిస్తే రూ.20 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఒక సాధారణ పీఏ సతీమణి బ్యాంకు ఖాతాలోకి రూ.20 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని పట్టాభి సూటిగా ప్రశ్నించారు. తిరుపతి, దర్శి, జగ్గయ్యపేట, భోగాపురం ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాలే కొన్నారన్నారు. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, కడప, తిరుపతిలో హైక్లాస్ అపార్టుమెంట్లు, విల్లాలున్నాయని వెల్లడించారు. మూడు రాష్ట్రాలు ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటకలో ఆస్తులు విస్తరించాయన్నారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వద్ద పనిచేసే పీఏ వద్ద రూ.20 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని మరోసారి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రశ్నించారు.