సీఎం ముందు స్పీచ్​ అదరగొట్టిన విద్యార్థులు - చంద్రబాబు అభినందనలు

🎬 Watch Now: Feature Video

thumbnail
సీఎం ముందు స్పీచ్​ అదరగొట్టిన విద్యార్థులు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 22, 2026 at 5:36 PM IST

1 Min Read
Choose ETV Bharat

Students Speech In Front Of CM Chandrababu in A Koduru: అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఏ. కోడూరులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు చిన్నారుల వేదికపై మాట్లాడిన మాటలకు మురిసిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్న సంక్షేమ పథకాలు, పాఠశాలల్లో అమలవుతున్న 'ముస్తాబు' కార్యక్రమంపై చిన్నారి మాట్లాడిన తీరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎంతగానో ఆకట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని, అది 'ఆక్టివ్ ప్రోగ్రెస్' అని విద్యార్థి అభివర్ణించారు. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం మనదని గర్వంగా చెప్పారు.

ప్రత్యేక ఆకర్షణగా చిన్నారుల స్పీచ్​: అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' నిర్మాణం, విశాఖపట్నానికి 'గూగుల్' రావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని కొనియాడారు. బాబు కేవలం రాష్ట్రానికే కాకుండా, దేశానికే ఒక విజనరీ లీడర్ అని చిన్నారులు వ్యాఖ్యానించారు. చిన్నారి వక్త తన ప్రసంగంతో పరిపాలనా విధానంపై ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని, భవిష్యత్ అభివృద్ధిపై యువతలో ఉన్న నమ్మకాన్ని అద్దం పట్టారు. ఈ ఘటన సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై చక్కగా మాట్లాడారంటూ వారిని సీఎం అభినందించారు.