ఫుట్​ బోర్డుపై ప్రయాణం - జారి పడబోయిన విద్యార్థి - వీడియో వైరల్​ - STUDENTS DANGEROUSLY TRAVELING

🎬 Watch Now: Feature Video

thumbnail
ఫుట్​ బోర్డుపై ప్రయాణం- జారి పడబోయిన విద్యార్థి - వీడియో వైరల్​ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 10, 2026 at 2:03 PM IST

1 Min Read
Choose ETV Bharat

Students Dangerously Traveling On The Foot board In Vijayawada RTC Bus : స్త్రీ శక్తి పథకం అమలుకు సంక్రాంతి రద్దీ తోడవ్వడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లే బస్సులే కాకుండా గ్రామీణ ప్రాంతాల బస్సుల్లోనూ విపరీతమైన రద్దీ నెలకుంటోంది. సరిపడా బస్సులు లేని కారణంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నట్లు వాపోతున్నారు. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే సిటీ బస్సులు ఏ మాత్రం సరిపోవడం లేదు. మైలవరం రూట్లో వెళ్లే బస్సుల్లో ఫుట్​ బోర్డుపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు విద్యార్థులు. 

కనీసం ఒక్క కాలు మోపేందుకు కూడా స్థలం లేని పరిస్ధితుల్లో సిటీ బస్సుల్లో వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. కేవలం చేతుల ఆధారంతో, రెండు కాళ్లు గాలిలో వేలాడుతున్నా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థి జారి కింద పడిపోతుండగా ప్రయాణికులు కేకలు వేయగా డ్రైవర్ బస్సును ఆపడంతో తృటిలో ప్రమాదం బారి నుంచి తప్పించుకున్నారు. ప్రమాదకరమైన ఈ బస్సు ప్రయాణ ఘటనను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్​గా మారింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details