దేవుని ఉత్సవాల్లో అపశ్రుతి - నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు - STAMPADE AT AMANAGALLU TEMPLE

🎬 Watch Now: Feature Video

thumbnail
దేవుని ఉత్సవాల్లో అపశ్రుతి - నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : March 4, 2026 at 12:42 PM IST

1 Min Read
Choose ETV Bharat

Stampade At Amanagallu Temple : ఆలయ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు తరలివచ్చారు. భక్తులంతా స్వామివారిని సేవలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయంలో భాగంగా స్వామివారిని ఊరేగించారు. దీనిలో భాగంగా నిప్పులపై నడిచారు. భక్తులంతా గుంపులుగా ఒక్కసారి గుంపులుగా నిప్పులపై నడవడంతో అనుకోని సంఘటన తలెత్తింది. ప్రమాదంలో చిన్నచిన్న గాయాలతో బయటపడటంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే? నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ​ఆమనగల్లు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. తెల్లవారుజామున ​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు. నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగారు. ఘటనలో సుమారు పది మందికి పైగా భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. చిన్నపాటి గాయాలతో భక్తులు బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

ABOUT THE AUTHOR

...view details