పేదలకు ఉచిత అంబులెన్స్​, ఆటోలను ప్రదానం చేసిన నటుడు సోనూసూద్​ - SONU SOOD SERVICE ACTIVITY AT HYD

🎬 Watch Now: Feature Video

thumbnail
హైదరాబాద్​లో సేవా కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్​ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : June 8, 2026 at 4:44 PM IST

|

Updated : June 8, 2026 at 5:07 PM IST

1 Min Read
Choose ETV Bharat

Sonu Sood Attended Service Activity At Hyd : మాల్యవి కరుణోదయ సొసైటీ ఫౌండేషన్​ ఇప్పటివరకు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. తాజాగా వనపర్తి జిల్లాలో సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్​ను బహుకరించారు. అలాగే హైదరాబాద్​లోని దమ్మాయిగూడ, చిల్కానగర్ ప్రాంతాలకు చెందిన పేద ఆటో కార్మికులకు జీవనోపాధి కోసం ఆటోలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు సోనూసూద్​ హాజరై పేదలకు తన చేతుల మీదుగా బహుకరించారు. బహుకరణ అనంతరం మాల్యవి కరుణోదయ సొసైటీ ఫౌండేషన్ ఉద్దేశించి సోనూసూద్​ మాట్లాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో చేయాలంటూ ప్రోత్సహించారు. స్వచ్ఛందంగా అంబులెన్స్‌ ప్రధానం చేయడమంటే ప్రాణాలు కాపాడడం లాంటిదేనని అలాంటి కార్యక్రమంలో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన మాల్యవి కరుణోదయ సొసైటీ ఫౌండర్ కొండ కృష్ణమ్మకు సోనూసూద్  అభినందనలు తెలిపారు. సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామ ప్రజలు సోనుసూద్ అంబులెన్స్​ను వినియోగించుకుని సురక్షితంగా ఉండాలని కోరారు. 

Last Updated : June 8, 2026 at 5:07 PM IST

ABOUT THE AUTHOR

ETV Bharat Telangana holds a significant position in both Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Building a strong presence in a specific region requires understanding the preferences and interests of the local population, ETV Bharat has successfully managed to do that in the state. Localised, original content that resonates with the culture, language, and aspirations of the people in the region plays a significant role in achieving this....view details