పవన్ కల్యాణ్​కు అడ్వాన్స్​ బర్త్​డే విషెస్​ - 'ఏ తల్లి కన్నదో నిన్ను ఓ పవనన్నా' సాంగ్ రిలీజ్

🎬 Watch Now: Feature Video

thumbnail
గిరిజన ప్రాంతాలకు పవన్ చేస్తున్న అభివృద్ధి పనులను కీర్తిస్తూ పాట (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 1, 2026 at 8:45 PM IST

1 Min Read
Choose ETV Bharat

Pawan Kalyan Birthday Song : సెప్టెంబర్ 2న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా గిరిజన ప్రాంతంలో ఓ రోజు ముందుగానే పండగ వాతావరణం నెలకొంది. తమ ప్రాంతాలకు చేస్తున్న ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు, సేవా కార్యక్రమాలను కీర్తిస్తూ విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన సురేశ్​ అనే రచయిత పాట రాశారు. 'ఏ తల్లి కన్నదో నిన్ను ఓ పవనన్నా' అంటూ ప్రారంభమయ్యే పాట గిరిజనులతో ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.

ఈ సాంగ్​ను అల్లూరి సీతారామరాజు జిల్లా చొంపి గ్రామంలో జానపద కళలు, సృజనాత్మకత ఛైర్మన్ గంగులయ్య ఆవిష్కరించారు. గిరిజనులకు వారి ఆచార వ్యవహారాలకు ఎక్కువ విలువనిచ్చే పవన్ కల్యాణ్​ను కీర్తిస్తూ ఆయన అమలు చేస్తున్న పథకాలను కీర్తిస్తూ ఈ పాట సాగుతుందని గంగులయ్య తెలిపారు. ఈ సందర్భంగా కేక్​లు కట్ చేసి పవన్ ముందస్తు జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే గిరిపుత్రులు థింసా నృత్యం చేస్తూ జనసేనానికి అడ్వాన్వ్​గా​ బర్త్ డే విషెస్ తెలిపారు. 