LIVE : ఎస్.జానకి పార్థివదేహానికి అభిమానుల నివాళులు - ప్రత్యక్షప్రాసారం - FUNERAL OF S JANAKI
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 12, 2026 at 9:35 AM IST
|Updated : July 12, 2026 at 1:48 PM IST
Singer S. Janaki funeral At Mysore : విఖ్యాత గాయని ఎస్.జానకి శనివారం తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని మైసూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శ్వాస సంబంధ సమస్యలతో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి శనివారం రాత్రి మృతి చెందారు. జానకి మరణ వార్తను ఆమె మనవరాలు అప్సర విద్యుల సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ప్రేమ, ఆప్యాయతలు పంచే కుటుంబ సభ్యుల మధ్య నాయనమ్మ ప్రశాంతంగా కన్నుమూశారని తెలిపారు. ఆమె అద్భుతమైన సంగీత ప్రయాణంలో కాలానికి అతీతమైన గీతాలను మిగిల్చివెళ్లారని పేర్కొన్నారు. వైవిధ్య స్వరంతో పాడిన పాటలు లెక్కలేనన్ని మధుర స్మృతులను మిగిల్చాయని మానవత్వం, దయాగుణం, గొప్ప వ్యక్తిత్వాన్ని మాకు విడిచి వెళ్లారని తెలిపారు. ఈ కష్ట సమయంలో మా కుటుంబ ఏకాంతతను గౌరవించాలని ప్రార్థిస్తున్నట్లు అప్సర విజ్ఞప్తి చేశారు. అభిమానులు చివరి చూపు కోసం ఎస్.జానకి పార్థివ దేహాన్ని మైసూరులోని మహారాజ కళాశాల మైదానానికి తరలించనున్నారు. అనంతరం మైసూరు తాలూకాలోని హెచ్.డి.కోటె రోడ్డులో ఉన్న కనియనహుండి ఫామ్ హౌస్ లో ఎస్.జానకి అంత్యక్రియలు జరుగుతాయని కర్ణాటక మంత్రి యతీంద్ర సిద్దరామయ్య తెలిపారు. సాయంత్రానికి మైసూర్ తాలూకాలోని కనియనహుండి నవీన్ ఫామ్ హౌస్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలు మైసూర్లోనే జరగాలని ఎస్.జానకి కోరుకున్నారని ఆమె కోరిక మేరకే మైసూర్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ లాంఛనాలతో ఎస్ .జానకి అంత్యక్రియలు చేయనున్నారు.