ఉత్సాహంగా ఆంధ్రా పికిల్​బాల్‌ లీగ్‌ పోటీలు - యువత నుంచి మంచి ఆదరణ

🎬 Watch Now: Feature Video

thumbnail
ఆంధ్రా పికిల్‌ బాల్‌ లీగ్‌ పోటీలు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 17, 2026 at 1:38 PM IST

1 Min Read
Choose ETV Bharat

AP PickleBall Games : ఆంధ్ర పికెల్ బాల్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెండోరోజు క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. రెండోరోజు నెల్లూరు వోల్వోస్ జట్లు సింగిల్స్, డబుల్స్, మిక్స్​డ్​ డబుల్స్​లో రాణించి విజయవాడ సన్ షైనర్స్ జట్టుపై 4-2 తేడాతో గెలుపొందారు. వేరొక పోటీల్లో తిరుపతి టైగర్స్ జట్లు 4-3 తేడాతో వైజాగ్ సీహాక్స్ జట్లపై విజయం సాధించాయి. ఒక దశలో 3-3తో ఇరుజట్లు సమం కాగా పోటీ టైబ్రేకర్​కు దారి తీసింది. చివరకు తిరుపతి ఆటగాళ్లు ఉత్కంఠభరిత పోటీలో విజయం సాధించారు. ఈ పోటీలకు మంచి ఆదరణ కన్పిస్తుందని, క్రికెట్ తర్వాత యువకులు ఎక్కువగా ఈ ఆటను నేర్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారని పికెల్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రన్, మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అభిప్రాయపడ్డారు. వైజాగ్ జట్టును కొనుగోలు చేసిన కొణిదెల నిహారిక, వర్థమాన హీరో సంతోష్ శోభన్ తదితరులు పోటీలకు హాజరై ఆకర్షణ తెచ్చారు.