నగరాల్లో హాస్టల్స్, రూమ్స్ దొరకడం లేదా? - 'పీజీఫై' యాప్‌తో బ్యాచిలర్ కష్టాలకు చెక్ - PGFY APP FOR HOSTELS AND ROOMS
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2026 at 6:30 PM IST
PGfy APP For Hostels and Rooms : కొందరు చదువు కోసం, మరికొందరు ఉద్యోగం కోసం సొంతూర్లు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. కానీ అక్కడ వారికి ఎదురయ్యే అతిపెద్ద సవాలు సురక్షితమైన, సరసమైన వసతి వెతుక్కోవడం. బ్రోకర్ల చుట్టూ తిరగలేక యాజమాన్యాల మోసాలు భరించలేక సరైన సదుపాయాలు లేని రూమ్‌లలో ఉంటూ ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన యువకుడు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, బెంగళూరు వంటి ఐటీ హబ్‌లలోని హాస్టల్స్, రూమ్‌ల నెట్‌వర్క్‌ను అనుసంధానిస్తూ యాప్ రూపొందించాడు.
"నేను ప్రస్తుతం మాస్టర్స్ చేస్తున్నాను. నా చదువు సమయంలో దాదాపు 8 సంవత్సరాలు హాస్టల్స్‌లోనే గడిపాను. ఆ సమయంలో నాకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. హాస్టల్స్‌లో ఉన్న ఆహార సమస్యలు, ఫీజులు చెల్లింపులు, పరిశుభ్రత, పని ప్రదేశానికి దగ్గర్లో హాస్టల్స్ దొరకకపోవడం లాంటింవి చాలా చూశాను. అప్పుడే హాస్టల్స్, రూమ్‌ల నెట్‌వర్క్‌ను అనుసంధానిస్తూ యాప్ రూపొందించాలనే ఆలోచన వచ్చింది. అలా పీజీఫై పేరుతో వినూత్న యాప్‌ను రూపొందించాను." - సాయి జగదీష్, పీజీఫై యాప్ రూపకర్త