చెరువులోకి దూసుకెళ్లిన 'పల్లెవెలుగు' - డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం - RTC BUS PLUGGED INTO POND
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 3:02 PM IST
RTC Bus Plugged into Pond at Bapatla District : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకువెళ్లిన ఘటన బాపట్ల జిల్లా నగరం మండలంలో జరిగింది. చీరాల నుంచి రేపల్లె వెళ్తున్న బస్సు చిరకాల వారిపాలెం గ్రామ శివారు మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సు వేగాన్ని నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఎవ్వరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్ స్టీరింగ్ స్ట్రక్ అవ్వడంతో ఘటన జరిగినట్లు సమాచారం.
రోడ్డు పక్కనే చెరువు ఉండటం, దానికి ప్రహరి లేకపోవడంతో బస్సు నీటిలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలుపుతున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ వ్యవహరించిన తీరు అభినందనీయం. ఈ ప్రమాదంలో గ్రామస్థులంతా భయాందోళనకు గురయ్యారు. బస్సు డ్రైవర్ ఏమరపాటుగా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ప్రస్తుతం ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏ అపాయం జరగలేదని స్థానికులు తెలుపుతున్నారు.