జేబీఎస్ వద్ద ప్రయాణికుల పైకి దూసుకెళ్లిన బస్సు - చక్రాల కింద ఇరుక్కుపోయిన వాహనదారుడు - RTC BUS ACCIDENT AT JBS BUS STATION
🎬 Watch Now: Feature Video

Published : June 3, 2026 at 6:32 PM IST
RTC Bus Accident At JBS Bus Station : సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంగా జేబీఎస్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికుల పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో విధులు ముగించుకుని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కార్ఖానా వైపునకు వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు శివపై బస్సు దూసుకెళ్లింది. దీంతో అతను బస్సు చక్రాల కింద ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు వెంటనే వాహనదారులు, క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపారు. ఆ తర్వాత శివను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో శివ కాలికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు అతివేగం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు శివ తెలిపాడు. డ్యూటీ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్తుండగా, జేబీఎస్ వరకు రాగానే బస్సు తనపైకి దూసుకు వచ్చిందని బాధితుడు పేర్కొన్నాడు.
అర్ధరాత్రి బస్సులో మంటలు - డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం