ప్రపంచ తెలుగు మహాసభల్లో రామోజీరావు విగ్రహం - హర్షం వ్యక్తం చేస్తున్న తెలుగువారు - RAMOJI STATUE AT TELUGU MAHASABHALU
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 5:16 PM IST
Ramoji Statue at World Telugu MahaSabhalu in Guntur District : గుంటూరు కేంద్రంగా జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, దివంగత రామోజీరావు ప్రాంగణం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆంధ్ర సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ మాతృ భాషా వేడుకలకు భారీగా భాషాభిమానులు, సాహితీ ప్రియులు తరలివచ్చారు. తెలుగు మహాసభల వేదికలో రామోజీరావు కళా ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన రామోజీరావు విగ్రహాన్ని చూసి ఆహుతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషిని కొనియాడుతున్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలకు గుర్తుగా రామోజీరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహాసభలకు విచ్చేసిన తెలుగువారిని రామోజీరావు విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోందంటున్న విగ్రహ రూపశిల్పి రాజ్ కుమార్ వడియార్ అన్నారు.