LIVE : రెండో రోజు రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - రెండోరోజు రాజ్యసభ సమావేశాలు
🎬 Watch Now: Feature Video

Published : July 21, 2026 at 11:04 AM IST
|Updated : July 21, 2026 at 11:12 AM IST
Rajya Sabha Session Live : రాజ్యసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మరోవైపు సోమవారం నాడు తొలిరోజే సమావేశాలు గరంగరంగా మొదలయ్యాయి. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అయోధ్యలో విరాళాల స్వాహా వంటి అంశాలపై ఉభయసభల్లోనూ విపక్ష ఇండియా కూటమి సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దానిపై సభా కార్యకలాపాలు స్తంభింపజేశారు. కాక్రోచ్ జనతాపార్టీ ఆధ్వర్యంలో బయట నిరసనలు వెల్లువెత్తగా పార్లమెంట్లోనూ దాని ప్రకంపనలు కనిపించాయి. స్వల్ప విరామాలతో ఆరుసార్లు వాయిదాపడి మళ్లీ సమావేశమై ఇవాళ్టికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో బిల్లును గందరగోళ పరిస్థితి మధ్యే సభలో ప్రవేశపెట్టారు. సంతాప తీర్మాన సమయంలోనూ నినాదాలివ్వడం సదాచారం కాదని స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. విద్యార్థుల నిరసనను లాఠీలతో అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. విద్యార్థులకు అనుకూలంగా వివిధ పార్టీల సభ్యులు నినాదాలిచ్చారు. అయోధ్య అంశాన్నీ లేవనెత్తారు. తొలుత తొమ్మిది మంది నూతన సభ్యుల చేత రాజ్యసభ ఛైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.