LIVE : పూరీ జగన్నాథుడి రథయాత్ర - ప్రత్యక్షప్రసారం - JAGANNATH RATH YATRA LIVE FROM PURI

🎬 Watch Now: Feature Video

thumbnail
PURI JAGANNATHA RATHA YATHRA (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : July 16, 2026 at 7:35 AM IST

|

Updated : July 16, 2026 at 7:39 PM IST

1 Min Read
Choose ETV Bharat

Puri Jagannath Rath Yatra 2026: పూరిలో శ్రీజగన్నాథస్వామి రథయాత్ర ప్రారంభమైంది. రథయాత్ర కోసం దేవస్థానం, ఒడిశా ప్రభుత్వం ఏర్పాట్లు చేశాయి. బలభద్రుడి రథం తాళధ్వజం, దేవి సుభద్ర రథం దర్పదళనం, జగన్నాథుడి రథం నందిఘోషను సర్వాంగ సుందరంగా అలకరించారు.  ఆషాఢ మాసంలో శుక్లపక్షం విదియ రోజు జరిగే పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు తమ ప్రత్యేక రథాలపై ఊరేగింపుగా గుండిచా ఆలయానికి వెళ్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో, స్వామివారు తన జన్మస్థానాన్ని పోలిన గుండిచా ఆలయంలో విశ్రాంతి తీసుకుంటారు. పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర కళ్లారా వీక్షించిన వారికి అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలం లభిస్తుందని, పునర్జన్మ లేకుండా మోక్షం పొందుతారని విశ్వాసం. జగన్నాథుని రథయాత్ర భారతీయ ఆధ్యాత్మికతతో సమైక్యతా సూత్రానికి ప్రతీకగా నిలుస్తుంది. పూరీ క్షేత్రంలో జగన్నాథుని స్వామి ఆలయంలోని విగ్రహాలు రాతితో కాకుండా వేప చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. ప్రతి సంవత్సరం పాత విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను ప్రతిష్టిస్తారు. ఈ సందర్భంగా తొలగించిన పాత విగ్రహాలను జ్యోతిష్య, గ్రహగతులను అనుసరిస్తూ ఖననం చేస్తారు. పాత విగ్రహాలను తొలగించే సమయంలో ఆ విగ్రహాల నుంచి నాభి భాగాన్ని మాత్రం వేరు చేసి కొత్త విగ్రహాలకు అమరుస్తారు. ఒడిశాలోని పూరిలో జరుగుతున్న రథయాత్ర ప్రత్యక్ష ప్రసారం మీకోసం...

Last Updated : July 16, 2026 at 7:39 PM IST