దొంగకు దెబ్బ అదుర్స్- పారిపోయేలా చేసిన యువతి- ప్రశంసలతో ముంచెత్తిన పోలీసులు - YOUNG WOMAN CONFRONTED ROBBERY

🎬 Watch Now: Feature Video

thumbnail
దొంగతనాన్ని ధైర్యంగా ఎదురించిన యువతి (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : December 25, 2025 at 11:02 AM IST

1 Min Read
Choose ETV Bharat

Young Woman Confronted The Robbery : కత్తితో బెదిరించి, దొంగతనం చేయడానికి ప్రయత్నించిన దొంగను అడ్డుకుంది పంజాబ్‌లోని లూథియానా జిల్లాలకు చెందిన ఓ యువతి. సోమవారం హంబాడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మనీ ట్రాన్స్‌ఫర్ దుకాణంలో సోనీ వర్మ అనే అమ్మాయి, ముసుగు ధరించిన దొంగను నెట్టివేసి పారిపోయేలా చేసింది. తన నగదు పెట్టెలోంచి డబ్బు తీయడానికి ప్రయత్నిస్తుండగా, ఆ యువతి ధైర్యం చేసి దొంగ కాలర్​ను​ గట్టిగా పట్టుకుంది. దీంతో భయపడిన దొంగ కత్తిని అక్కడే పడేసి వెంటనే పారిపోయాడు. ధైర్యవంతురాలైన సోనీ వర్మ నిందితుడు దోపిడీ ఉద్దేశ్యంతోనే దుకాణంలోకి వచ్చాడని పోలీసులకు చెప్పింది. ''అతడు నాకు కత్తి చూపించి నా చెంప పట్టుకున్నాడు, కానీ ఆ సమయంలో నేను ధైర్యం చేసి అతడి కాలర్ పట్టుకున్నాను. దీంతో భయపడి దుకాణం నుంచి పారిపోయాడు'' అని ఆమె చెప్పింది. సోనీ చేసిన ధైర్యసాహసాలను స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​ ( ఎస్​హెచ్ఓ) గుర్చరణ్​జిత్ సింగ్​ ప్రశంసించారు. 

ABOUT THE AUTHOR

...view details