LIVE: సీఈసీకి వ్యతిరేకంగా రాజ్‌ఘాట్ వద్ద ఇండీ కూటమి నేతల ఆందోళన - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 8, 2026 at 5:35 PM IST
CEC Protest Live : దిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజ్‌ఘాట్ వద్ద ప్రార్థన చేసి, ధర్నా చేపట్టారు ఇండీ కూటమి నేతలు. సర్ వివాదం నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌తో గత రెండు రోజులుగా దిల్లీ దద్దరిల్లుతోంది. బుధవారం జంతర్ మంతర్వద్ద ధర్నా నిర్వహించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. గురువారం కూడా విపక్ష ఎంపీలు భారీ నిరసనలు చేపడుతున్నారు. 300 మంది ఎంపీలు ప్రశాంతంగా ఆందోళన చేయాలనుకుంటున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తెలిపారు. నిన్న జంతర్‌మంతర్ వెళ్లాలని ప్రయత్నించామని అన్నారు. మోదీ, అమిత్‌షా, మోహన్ భగవత్, జ్ఞానేశ్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు నలుగురు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. గాంధీ తీసుకువచ్చిన స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. స్వాతంత్ర్యంతో పాటు ఓటుహక్కును కాలరాస్తున్నారని విమర్శించారు. రాజ్‌ఘాట్ వద్దకు ఇండీ కూటమి నేతలు చేరుకున్నారు. బస్సుల్లో ర్యాలీగా వచ్చారు. దిల్లీలో విపక్ష ఎంపీల ఆందోళన ర్యాలీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.