LIVE : ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోదీ ప్రసంగం - ప్రత్యక్షప్రసారం - MODI IN THE ISRAELI PARLIAMENT
🎬 Watch Now: Feature Video

Published : February 25, 2026 at 9:47 PM IST
|Updated : February 25, 2026 at 9:55 PM IST
Prime Minister Narendra Modi live : నేడు ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సతీసమేతంగా ఘనస్వాగతం పలికారు. ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ టెల్ అవీవ్ విమానాశ్రయానికి చేరుకున్న నెతన్యాహు మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్‌తో సైన్యం గౌరవ వందనం సమర్పించింది. విమానాశ్రయంలో నెతన్యాహుతో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి ఇరువురు నేతలు కారులో హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు నేతలు, కొద్దిసేపు చర్చలు జరిపారు. అక్కడ ప్రధాని మోదీని ప్రవాస భారతీయులు కలిశారు. ఈ సందర్భంగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ప్రవాసులు నృత్యాలు చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్ -ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా, నెతన్యాహుతో చర్చలు జరుపుతానని ప్రధాని మోదీ ఇప్పటికే పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం.