నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు - పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు - CAR CRASHED INTO DHARMA HOUSE
🎬 Watch Now: Feature Video

Published : July 10, 2026 at 3:50 PM IST
Car Crashed Into Dharma House : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నంబర్ 10 సీలో సినీ నటుడు ధర్మ నివాసంలోకి ఓ కారు దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మద్యం మత్తులో ఉన్న యువకులు అతివేగంగా కారు నడపడంతో వాహనం అదుపు తప్పి నేరుగా నటుడు ధర్మ ఇంటి ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి ఆవరణలో ప్రహరీ గోడ, ఇంటి గేటు దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కారులో ఉన్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలు, మద్యం సేవించి వాహనం నడిపారా? లేదా అనే అంశాలపై దర్యాప్తు చేపట్టారు. ఊహించని ఘటన జరగడంతో ధర్మ, కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.