ఉత్తరాంధ్ర జీవనాడి పోలవరం ఎడమ కాలువ

🎬 Watch Now: Feature Video

thumbnail
ఉత్తరాంధ్ర జీవనాడి పోలవరం ఎడమ కాలువ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 1, 2026 at 10:46 PM IST

1 Min Read
Choose ETV Bharat

Polavaram Left Canal : ఉత్తరాంధ్ర ప్రజల నీటి కరవును తీర్చే అమృత ధారగా పోలవరం ఎడమ కాలువ నిలవనుంది. గోదారమ్మ రాకతో ఆ ప్రాంతం సస్యశ్యామలం కానుంది. వాస్తవానికి 2019 తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్న ఆశలను ప్రజలు వదులుకున్నారు. పనులు ముందుకు సాగక రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో మళ్లీ పనులు ఊపందుకున్నాయి. ఆయన చేసిన భగీరథ ప్రయత్నంతో ఇప్పుడు ప్రాజెక్టు సాకారం కాబోతోంది. గత రెండేళ్ల వ్యవధిలో కాలువ పనుల్లో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. వాటన్నింటినీ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించింది.

కాలువ ప్రవహించే మార్గంలో పెద్ద పెద్ద నదులు, జాతీయ రహదారులు అడ్డుగా వచ్చాయి. అద్భుతమైన సాంకేతిక నైపుణ్యంతో వాటిని సైతం దాటిస్తూ ఈ కాలువను నిర్మించారు. కేవలం రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో ఈ నిర్మాణ పనులను పూర్తి చేశామని పోలవరం ఎడమ కాలువ ఎస్‌ఈ ఏసుబాబు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గోదావరి జలాలు తమ ప్రాంతానికి వస్తుండటంతో ఉత్తరాంధ్ర వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కాలువ ద్వారా రానున్న రోజుల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు, ఆ ప్రాంత తాగునీటి కష్టాలు కూడా తీరనున్నాయి.