వెలిగొండ కల సాకరమవనున్న వేళ ఊరూరా సంబరాలు

🎬 Watch Now: Feature Video

thumbnail
వెలిగొండ ప్రాజెక్ట్ సాకారం అవుతున్న వేళ ఊరూరా సంబరాలు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 4:48 PM IST

1 Min Read
Choose ETV Bharat

People Celebrations for Veligonda Project: మార్కాపురం జిల్లా వాసుల చిరకాల స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్ట్ సాకారం అవుతున్న వేళ ఊరూరా సంబరాలు మిన్నంటుతున్నాయి. ఈనెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్ట్​ను ప్రారంభించనున్న నేపథ్యంలో మార్కాపురంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ, ట్రాక్టర్​లతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో పాటు కూటమి నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద నుంచి వీధుల గుండా అల్లూరి పోలేరమ్మ ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తమ ప్రాంతవాసుల కోరిక నెరవేర్చిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని ఎమ్మెల్యే నారాయణరెడ్డి పేర్కొన్నారు. చెన్నకేశవస్వామి, పోలేరమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. 

ట్రాక్టర్​ ర్యాలీ: యర్రగొండపాలెంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ జోరుగా సాగింది. ఎరిక్షన్ బాబు స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులు, నాయకులకు ఉత్సాహ పరిచారు. వెలిగొండ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని ఎరిక్షన్ బాబు అన్నారు. కరువు కటాకలతో పట్టిపీడిస్తున్న తమ ప్రాంతానికి కృష్ణా జలాలు రాకతో సస్యశ్యామలంగా మారబోతుందని ఎరిక్షన్ బాబు అభిప్రాయపడ్డారు.