LIVE : రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - RAJYA SABHA SESSION LIVE
🎬 Watch Now: Feature Video

Published : February 10, 2026 at 11:03 AM IST
|Updated : February 10, 2026 at 1:00 PM IST
Parliament Session Rajya Sabha LIVE : పార్లమెంటులో సోమవారం కూడా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. విపక్షాల నిరసనలతో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. రాహుల్‌ను మాట్లాడనివ్వాలనే డిమాండులో సభను విపక్షం స్తంభింపజేసింది. ఇరుపక్షాలూ తమతమ వాదనలు వినిపించాయి. చివరకు సభ మంగళవారానికి వాయిదా పడింది. అటు రాజ్యసభలో ఇదే అంశంపై ఖర్గే మాట్లాడటానికి అనుమతి లభించకపోవడంతో కాంగ్రెస్ సహా విపక్షాలు వాకౌట్ చేశాయి. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌పై డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సభాహక్కుల తీర్మాన నోటీసు ఇచ్చారు. పార్లమెంటు జరుగుతున్నప్పుడు అమెరికా వాణిజ్య ఒప్పందంపై బయట ప్రకటన చేయడాన్ని తప్పుబట్టారు. సభలో సంఖ్యాబలం తమకున్న దృష్ట్యా ఏ బిల్లునైనా ఆమోదించుకోవడంలో ఇబ్బంది ఉండదని, చర్చ జరగకపోతే ప్రతిపక్షానికే నష్టమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. స్పీకర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టినా ఆయన్ని తొలగించడానికి కావాల్సినంత బలం విపక్షాలకు లేదని చెప్పారు. ప్రస్తుతం నేటి రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.