LIVE : లోక్‌సభ మలివిడత సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - LOK SABHA SECOND PHASE SESSIONS
🎬 Watch Now: Feature Video

Published : March 13, 2026 at 11:00 AM IST
|Updated : March 13, 2026 at 3:06 PM IST
Lok Sabha Second Phase Sessions : పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య వాదోపవాదాలు సాగుతున్నాయి. బీజేపీ లోపాలను కాంగ్రెస్ పార్టీ ఎత్తిచూపుతోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ సభ్యులు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయని, యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. చర్చలు, దౌత్యపరంగా సమస్య పరిష్కారమవుతుందని భారత్ నమ్ముతుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతపై తమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. చమురు సరఫరా చేసే వేర్వేరు దేశాలతో సంబంధాలు కొనసాగించే హక్కును కేంద్ర ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టిందని లోక్‌సభ విపక్షనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎవరి నుంచి ఇంధనాన్ని కొనాలో అమెరికా నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా లక్‌సభ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.