LIVE: పార్లమెంటు మలివిడత బడ్జెట్‌ సమావేశాలు - లోక్​సభ ప్రత్యక్ష ప్రసారం - PARLIAMENT BUDGET SESSION LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Parliament Second Phase Budget Session Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 9, 2026 at 12:09 PM IST

|

Updated : March 9, 2026 at 12:37 PM IST

1 Min Read
Choose ETV Bharat

Parliament Second Phase Budget Session Live: పార్లమెంటు మలివిడత బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం తొలిరోజే చర్చకు రానుండటంతో ఈ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఈ తీర్మానం తేలేవరకు సభకు అధ్యక్షత వహించకూడదని స్పీకర్‌ ఓం బిర్లా తొలివిడత సమావేశాల్లోనే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం చర్చ నేపథ్యంలో లోక్​సభ ఎంపీలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు విప్ జారీ చేశాయి. నేటి నుంచి బుధవారం వరకు లోకసభ ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 3 లైన్ విప్​ జారీ చేశాయి. పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులూ ప్రముఖంగా చర్చకు రానున్నాయి.  ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్‌) ద్వారా పశ్చిమబెంగాల్‌లో 60 లక్షల మంది ఓటర్లను తొలగించడం, రాష్ట్రపతికి ఆ రాష్ట్రంలో ఎదురైన చేదు అనుభవం వంటివి ఈ సమావేశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. తొలివిడత సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులు, విద్యుచ్ఛక్తికి సంబంధించిన మరో బిల్లును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 

Last Updated : March 9, 2026 at 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details