LIVE : లోక్​సభ వర్షాకాల సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - పార్లమెంట్ సమావేశాలు

🎬 Watch Now: Feature Video

thumbnail
Lok Sabha Session 2026 LIVE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : July 21, 2026 at 11:01 AM IST

|

Updated : July 21, 2026 at 12:10 PM IST

1 Min Read
Choose ETV Bharat

 Monsoon Lok Sabha Session 2026 Live : రెండోరోజు వర్షాకాల లోక్​సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఊహించిన రీతిలోనే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలిరోజే వేడి వేడిగా మొదలయ్యాయి. నీట్‌ పేపర్​ లీకేజీ, అయోధ్య రామమందిరంలో విరాళాల స్వాహా వంటి అంశాలపై ఉభయసభల్లోనూ విపక్ష ఇండియా కూటమి సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దానిపై ప్రతిపక్ష ఎంపీలు సభా కార్యకలాపాలు స్తంభింపజేశారు. కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ బయట నిరసనలు వెల్లువెత్తగా లోపల కూడా దాని ప్రకంపనలు కనిపించాయి. చిన్న చిన్న బ్రేక్​లతో ఆరుసార్లు వాయిదాపడి మళ్లీ సమావేశమైన లోక్‌సభ చివరకు మంగళవారానికి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ జారీచేసిన జీవో స్థానంలో బిల్లును గందరగోళ పరిస్థితి మధ్యే సభలో ప్రవేశపెట్టారు. దివంగత మాజీ ఎంపీలకు సంతాప తీర్మాన సమయంలోనూ నినాదాలివ్వడం మంచి సంప్రదాయం కాదని స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. విద్యార్థుల నిరసనను లాఠీలతో అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.  

Last Updated : July 21, 2026 at 12:10 PM IST