LIVE : రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - RAJYA SABHA SESSIONS LIVE
🎬 Watch Now: Feature Video

Published : March 13, 2026 at 11:15 AM IST
|Updated : March 13, 2026 at 3:07 PM IST
Rajyasabha Sessions Live : పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రికత్తల వేళ దేశంలో ఇంధన భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో గురువారం ఎల్పీజీ అంశంపై చర్చ జరిగింది. అప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎప్‌స్టీన్ ఫైళ్ల ప్రస్తావన తీసుకురావడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. రెండ్రోజుల చర్చ అనంతరం బుధవారం సాయంత్రం విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మూజువాణి ఓటుతో అది వీగిపోయింది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబెపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తన పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పూర్తయ్యేవరకు సభకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్న స్పీకర్ అది వీగిపోగానే మళ్లీ యథావిధిగా తన బాధ్యతలు చేపట్టారు. ఈ పరిస్థితుల మధ్యనే ఓటింగు నిర్వహించి తీర్మానాన్ని తిరస్కరించారు. ప్రస్తుతం నేటి రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.