LIVE : రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - RAJYA SABHA SESSION LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Rajya Sabha Session LIVE (ETV)

By ETV Bharat Telangana Team

Published : February 11, 2026 at 11:04 AM IST

|

Updated : February 11, 2026 at 1:01 PM IST

1 Min Read
Choose ETV Bharat

Parliament Rajya Sabha Session Live : పార్లమెంటులో మంగళవారం కూడా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. విపక్షాల నిరసనలతో లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. సభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని, ప్రజా సమస్యలు లేవనెత్తే హక్కును పదేపదే నిరాకరిస్తున్నారని  రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తొలగింపునకు తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కాంగ్రెస్‌ నేతృత్వంలో 118 మంది విపక్ష ఎంపీలు మంగళవారం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌కు నోటీసు సమర్పించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో రాహుల్‌గాంధీ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయని ఖర్గే ధ్వజమెత్తారు. న్యాయసమ్మతమైన ప్రజా సంబంధిత అంశాలు లేవనెత్తనీయకుండా లోక్​సభ స్పీకర్‌ ఓం బిర్లా తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. విపక్ష నేతలు ముందుగా రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమై నోటీసుపై తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నేటి రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : February 11, 2026 at 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details